శ్రద్ధావాకర్ హత్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సుప్రీం కోర్టుకు పోలీసులు సమర్పించిన ఛార్జిషీటుతో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. శ్రద్దావాకర్‌ను హత్య చేసిన అనంతరం ఆమె ఎముకలను ఆఫ్తాబ్ గ్రైండర్ లో వేసి పొడి చేశాడని ఛార్జిషీట్ లో పోలీసులు తెలిపారు.
ఆమెను హత్య చేసిన తర్వాత జొమాటో నుంచి అఫ్తాబ్ చికెన్ రోల్స్ తెప్పించుకుని తిన్నాడు. హత్య చేసిన మూడు నెలల తర్వాత ఆమె తలను అఫ్తాబ్ డిస్పోజ్ చేశాడు. శ్రద్ధావాకర్, పూనావాలాకు డేటింగ్ యాప్ లో పరిచయం అయింది. గతేడాది మేలో వారిద్దరూ ఢిల్లీకి వచ్చారు.
ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గతేడాది మే 18న వారు ముంబై వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే టికెట్ల విషయంలో వారిద్దరికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో టికెట్లను అఫ్తాబ్ క్యాన్సిల్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో శ్రద్దాను అఫ్తాబ్ హత్య చేశాడు.
ఛార్జిషీటులో వెల్లడించిన వివరాల ప్రకారం… మొదట శ్రద్దా మృత దేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగులో ప్యాక్ చేసి డిస్పోజ్ చేయాలని అఫ్తాబ్ ప్లాన్ చేశాడు. అయితే దొరికిపోతానన్న భయంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఆ తర్వాత శ్రద్దా శవాన్ని ముక్కలు ముక్కలుగా రంపంతో కోశాడు.
మృతదేహాన్ని మొత్తం 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. అప్పుడప్పుడు అఫ్తాబ్ రూమ్ కు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆమె మృతదేహాన్ని కిచెన్ లో దాచి పెట్టేవాడు. ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్ ను కూడా అప్తాబ్ దాచేశాడు.
అఫ్తాబ్ ను అదుపులోని తీసుకుని విచారించగా హత్య విషయం ఒప్పుకున్నాడు. అటవి ప్రాంతలో వేసిన ఎముకలను, శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆమె తల ఆచూకిని పోలీసులు దొరకబట్టలేకపోయారు.
గతేడాది అఫ్తాబ్‌కు పోలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షలను నిర్వహించారు. ఆ సమయంలో హత్య గురించి అఫ్తాబ్ ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. జరిగిన దానికి పశ్చాత్తాప పడుతున్నట్టు అఫ్తాబ్ పేర్కొనడాన్ని ఛార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు.