తమిళ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో సుధ కొంగర దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ పౌండర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓ టి టి వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ బరిలో ఎంపికైనట్లు తెలుస్తోంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ తో పాటు మరిన్ని కేటగిరీలలో ఈ సినిమా ఉందని సమాచారం. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ కోసం.. ఆస్కార్స్‌లో జనరల్ క్యాటగిరీలో పోటీపడనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.