కాంగ్రెస్ అనేది బీజేపీకీ ఆశాకిరణమే తప్ప.. గోవా ప్రజలు కాదు అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ట్విట్టర్ లో సోమవారం చేసిన పోస్ట్ కి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఈ కౌంటర్ ఇచ్చారు.
ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఓట్లను చీల్చి.. బీజేపీ గెలుపుకు కారణమవుతున్నాయని కేజ్రీవాల్ చెప్తున్నారంటూ.. చిదంబరం ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ఆ ఏడుపు ఆపండి సార్.. ఇప్పటికే 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 15 మంది బీజేపీలోకి చేరిపోయారు అంటూ ఘాటుగా సమాదానం ఇచ్చారు.
తద్వారా కాంగ్రెస్ కి పడాల్సిన ప్రతి ఓటు బీజేపీకి ఖాతాలో పడిపోతుందంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పైగా బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కి రావల్సిన ప్రతి ఓటు సురక్షితంగా బీజేపీ ఖాతాలో పడిపోవడం ఖాయం.. కాబట్టి కాంగ్రెస్ నే గెలిపించండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కేజ్రీవాల్.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలుపు గుర్రాలకు సంకెళ్లు వేయాలని ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. పంజాబ్, గోవాలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.