మెగాస్టార్ నటించిన సినిమాలంటే ఎప్పుడూ ఫ్యాన్స్‌కి పూనకాలే. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన రిక్షావోడు చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమా 1995లో విడుదలైంది. కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం చిరంజీవికి కూడా కలిసి రాలేదు. చిరు ఫాంలో లేని టైంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కూడా పరాజయం పాలైంది.
అదే టైంలో రిలీజ్ అయిన ఆర్.నారాయణ మూర్తి ఒరేయ్ రిక్షా మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీంతో చిరు అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.ఒరేయ్ రిక్షా చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. అయితే.. రిక్షావోడు చిత్రం పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఫ్లాష్ బ్యాక్ ను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వల్లే అనే కామెంట్లు వినిపించాయి.
రిక్షావోడు లో హీరోయిన్లుగా సౌందర్య, నగ్మా నటించారు. సౌందర్య ని సెకండ్ హీరోయిన్ గా పెట్టడం కూడా చాలా మందికి నచ్చలేదు. ఇదిలా ఉండగా.. రిక్షావోడు సినిమాలో హీరోయిన్లుగా మొదట ఆమని, సౌందర్య ఎంపికయ్యారట.
మొదట ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడిగా ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడం కోడి రామకృష్ణ వచ్చి చేరడం జరిగింది. దర్శకుడు మారిన తర్వాత ఆమని ని తప్పించి ఆమె స్థానంలో నగ్మా ని ఎంపిక చేసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
చిరంజీవి గారు తనకు ఇష్టమైన హీరో అని.. సౌందర్య తన బెస్ట్ ఫ్రెండ్ అని .. వాళ్ళిద్దరితో కలిసి నటించే ఛాన్స్ మిస్ అవ్వడం తనను బాగా బాధపెట్టిందని అమని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
Also Read: నటరత్న ఎన్టీఆర్ యాడ్స్ లో నటించడానికి ఎంత తీసుకున్నారంటే?