ప్రశాంత్ నీల్ సాండిల్ వుడ్ నుంచి దూసుకువచ్చిన దర్శకుడు. KGF చాప్టర్ 2 తో పేన్ ఇండియన్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఒక సినిమాలోనే పదిమందికి తక్కువ కాకుండా విలన్స్ తో పవర్ ఫుల్ విలన్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు ప్రశాంత్ నీల్. KGF చాప్టర్1లోనే కాదు, చాప్టర్2 లో క్లియర్ గా చూసాం.
దక్షిణాదిలో విలన్లు సరిపోక ఉత్తరాదికి విలన్ల వేటకి వెళ్ళాడు. ఆ క్రమంలోనే సంజయ్ దత్ ను KGF2 లో విలన్ చేసాడు. ప్రశాంత్ , ‘జూ.ఎన్టీఆర్ 31’ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడీ సినిమా గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈ చిత్రంలోని కీలక పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తున్నారని తెలిసింది. నటించడం అంటే ఏదో సహాయనటుడిగా కాదు, ఎన్టీఆర్ సినిమాకి అమీర్ ని విలన్ గా చేయమని అడిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ఈ పాత్రగురించి డిస్కస్ చేసారని,అమీర్ కు కూడా ఈ పాత్ర నచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇక ఈ విషయం తెసుకున్న ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇకబోతే RRR తో సూపర్ హిట్ ని అందుకున్న తారక్ ప్రస్తుతం కొరటాలతో చేయబోయే సినిమా కోసం సిద్ధమవుతున్నారు.
ఇది కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.ఈ చిత్రం పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తారు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.