‘ది కాశ్మీరిఫైల్స్’ ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. అందరి హృదయాలను కొల్లగొడుతూ చరిత్ర సృష్టిస్తున్న ఈ సినిమాను తాను తప్పకుండా చూస్తానని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ ఫ్యాన్ ఈవెంట్ ను న్యూఢిల్లీలో నిర్వహించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబర్స్ ఇందులో పాల్గొన్నారు. వారితో పాటు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేరారు.
‘ కాశ్మీరీ పండిట్లకు జరిగిన ఘటన చాలా బాధాకరం. అలాంటి చిత్రాన్ని భారతీయులందరూ తప్పక చూడాలి, తద్వారా ఏమి జరిగిందో వారు గుర్తుంచుకోగలరు’ అని అన్నారు.
ఈ చిత్రం మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరి భావోద్వేగాలను తాకిందన్నారు. “ ఈ సినిమాను తప్పకుండా చూస్తాను. సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.