నిర్భయ దోషులకు ఉరి శిక్ష విధించడంలో ఆలస్యానికి కారణం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగడంలో ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా మెర్సీ పిటిషన్ వేసుకొమ్మని దోషులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని జవదేకర్ ప్రశ్నించారు.
నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తనకు విధించిన ఉరిశిక్షపై క్షమా భిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నలుగురు దోషులను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలన్న ఢిల్లీ కోర్టు తీర్పు అమలు కావడం అసాధ్యం.