బీజేపీ ప్రభుత్వం ఒకే వ్యక్తి కోసం పనిచేస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆకాశం నుంచి పాతాళం వరకు అన్నీ అదానీ పేరుమీదే రాసిస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదేమని అడిగిన వారిపై ఈడీ , సీబీఐలను ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు.
మహిళల రిజర్వేషన్‌లు అమలు చేయాలంటూ భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు హాజరైన ఆయన కవిత దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కానీ బిల్లు తీసుకు వచ్చేందుకు మోడీ సర్కార్ ముందుకు రావడం లేదన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను బీజేపీ తప్పిందన్నారు. చట్టసభల్లో ఈ పోరాటం ఇవాళ్టిది కాదన్నారు.
కొన్ని దశాబ్దాలుగా ఈ నినాదాలు వినిపిస్తున్నాయన్నారు. ఆ నినాదాలు విని చెవులు చిల్లులు పడుతున్నాయన్నారు. ఆ బిల్లు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు. ఈడీలు, సీబీఐలు తమను ఏం చేయలేవని స్పష్టం చేశారు. తామెవరికీ భయపడే రకం కాదన్నారు.