టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఆయనతో పాటు ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పాతక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాలను కూడా పంజాబ్ నుంచి రాజ్యసభకు ఆప్ నామినెట్ చేసింది.
పంజాబ్ లో ఐదు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ 9న ఖాళీ కానున్నాయి. వీటికి మార్చి 31 న ఎన్నికల నిర్వహించనున్నారు. వీటి నామినేషన్ల గడవు నేటితో ముగియనున్నది. ఈ క్రమంలో వీరి పేర్లను ఆప్ పార్టీ సోమవారం ఖరారు చేసింది. దీంతో ఆ ఐదుగురు నామినేషన్ వేశారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 117 గాను 92 స్థానాల్లో ఆప్ విజయ ఢంకా మోగించింది. తాజా సభ్యులతో కలిపితే రాజ్యసభలో ఆప్ సభ్యుల సంఖ్య 8కి చేరనుంది.