పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆమ్ ఆద్మీ. ఇప్పటికే సర్వేలు ఆపార్టీకే గెలుపు ఖాయమని చెబుతున్నాయి. అయినా.. ఛాన్స్ తీసుకోకుండా పంజాబ్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది ఆప్. తాము అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు వెయ్యి రూపాయల నగదును అందిస్తామని తెలిపింది. అలాగే ఉచిత వైద్యం, విద్య, విద్యుత్ పథకాలను ప్రకటించింది. తాజాగా సీఎం అభ్యర్థి ఎవరో ఓ హింట్ ఇచ్చారు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.
పంజాబ్ లో తమ పార్టీ సీనియర్ లీడర్ భగవంత్ మన్ ను సీఎం క్యాండెట్ గా అనౌన్స్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు కేజ్రీవాల్. ఆయన తనకు సోదరుడు లాంటి వారన్నారు. అయితే.. పంజాబ్ ప్రజలే దీనిని నిర్ణయించాలని వారికే వదిలేశారు.
ఆప్ తరఫున సీఎం అభ్యర్ధిగా ఎవరు ఉండాలనే దానిపై 7074870748 నెంబర్ కు జనవరి 17 సాయంత్రం 5 గంటల్లోగా తమ అభిప్రాయాలు వెల్లడించాలని తెలిపారు కేజ్రీవాల్. ప్రజలు ఈ నెంబర్ కు కాల్స్, మెసేజ్ ల ద్వారా ఫీడ్ బ్యాక్ అందించాలని కోరారు కేజ్రీవాల్. ప్రజల ఓట్లతో సీఎం అభ్యర్థిని గుర్తించే ప్రక్రియను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని.. ప్రజలు కోరుకున్న విధంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Call/SMS/Whatsapp – 7074870748 #JantaChunegiCM pic.twitter.com/1RWrnyhhy1
— AAP Punjab (@AAPPunjab) January 13, 2022
Advertisements
ఈమధ్యే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలున్నాయి. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు సాధించింది. ఈసారి సర్వేలు ఆప్ వైపు ఉన్నాయి.