తక్కువ టైమ్ లో బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగి ప్రముఖ బాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది మీనాక్షి శేషాద్రి.బాలీవుడ్ లో ఆమె చేసిన మొదటి సినిమా ‘పెయింటర్ బాబు’. ఈ సినిమా ద్వారా పరిచయమై అంచెలు అంచెలుగా ఎదిగింది.
ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో కూడా నటించింది. టాలీవుడ్ లో ఈమె నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘జీవన పోరాటం’ అనే సినిమాలో కూడా నటించింది.
ఆపై చిరంజీవి హీరోగా కే.విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో కూడా కధానాయికగా నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా ఆశినంత విజయం అందుకోలేకపోయినా.. అందరికీ గుర్తుండిపోయే తెలుగు క్లాసిక్ సినిమాలో ఒకటిగా నిలిపోయింది.
అయితే మీనాక్షి టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తరువాత సినిమాలకు దొరమై అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం ఆమె ఓ డాన్స్ స్కూల్ నడుపుతూ అమెరికాలో జీవితాన్ని బిజీ బిజీగా గడిపేస్తోంది. మీనాక్షీ శేషాద్రికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజగా మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు నట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీటిన చూసిన తర్వాత అప్పుడు మనం చూసిన మీనాక్షి శేషాద్రీయేనా అనే అనుమానాలు రావడం సహజమే.
Also Read: సందీప్ రెడ్డి వంగా ముందు ఏం చేసాడో తెలుసా…?