హిమాచల్ ప్రదేశ్ లో ఖలిస్తాన్ జెండాల ఘటనపై బీజేపీని ఆప్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. జాతీయ భద్రతకు భరోసా ఇవ్వడంలో బీజేపీ విఫలమైందని ఆప్ ఆరోపించింది.
ఇక దేశ ప్రజలను బీజేపీ ఎలా కాపాడుతుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఘటన బీజేపీ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
బీజేపీ మొత్తం ఒక గూండా( తజీందర్ పాల్ సింగ్ బగ్గా)ను కాపాడే పనిలో పడిందన్నారు. ఈ లోగా ఖలిస్తానీలు అక్కడ జెండాను పెట్టిపోయారు అని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మెయిన్ గేటుకు ఆదివారం ఖలిస్తాన్ జెండాలు వెలిశాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.