క్రికెట్ అభిమానులకు ఏబీ డివిలియర్స్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అతను బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వచ్చాడంటే ఫాన్స్ కు పండగే. ఇక ముఖ్యంగా ఐపీఎల్ తో ఇండియాలో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు డివిలియర్స్. అయితే ఇటీవలే ఎబి డివిలియర్స్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్లకు కూడా తను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక ఇదే విషయమై ఫ్యాన్స్ ఎంతో ఆవేదన కు గురయ్యారు.
అయితే ఇప్పుడు మళ్ళీఆర్సీబీ కి ఏబీ డివిలియర్స్ రాబోతున్నాడట. వచ్చే సీజన్ లో ఆర్సీబీ కి బ్యాటింగ్ కోచ్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు. డివిలియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్ గా నియమిస్తే ఆటగాళ్లకు జట్టుకు ఎంతో బాగుంటుందని సంజయ్ అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఆర్సీబీ యాజమాన్యం చేయలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.