అబ్ధుల్లాపూర్‌మెట్ మండల ఎమ్మార్వో విజయారెడ్డిను పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన సురేష్ అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసే క్రమంలో… విజయారెడ్డితో పాటు డ్రైవర్, సురేష్‌లపై కూడా పెట్రలో పడటం మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఎమ్మార్వో అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దాదాపు 65శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ కూడా గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సురేష్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.