బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్ కు ఆఫర్లపై ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది! లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ కు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. బిగ్ బాస్ కంటే ముందు పెళ్లిగోల అనే వెబ్ సీరిస్ చేసినప్పటికీ రావల్సినంత గుర్తింపు రాలేదు….బిగ్ బాస్ 4 తో మాత్రం అతను ఊహించనంతా గుర్తింపొచ్చింది. విన్నర్ అయినందుకు 25 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ….. కొన్ని ఆఫర్స్ అభిజిత్ కు వెల్ కమ్ చెబుతున్నట్టు తెలుస్తోంది?
ఏయే ఆఫర్లు లైన్ లో ఉన్నాయి?
1) ఆహా…. అభిజీత్ తో ఓ ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉందట!
2) స్టార్ మా కూడా అభిజీత్ ను లీడ్ గా పెట్టి ఓ షో చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.
3) ఓ యంగ్ డైరెక్టర్ …..అభిజీత్ తో సినిమా తీయడానికి కథను కూడా రెడీ చేసుకున్నట్టు వినికిడి.
4) ఓ స్టార్ ప్రొడ్యూసర్ ….అభిజీత్ తో సినిమా గురించి ఇదివరకే వారి పేరెంట్స్ తో టచ్ లో ఉన్నాడట.!
ఇందులో ఏ ప్రాజెక్ట్ లు ఫైనల్ అవుతాయో…? ఇంకెన్ని కొత్త ప్రాజెక్ట్ లు యాడ్ అవుతాయో చూడాలి !