బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ తాజా చిత్రం ‘బాబ్ బిస్వాస్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చిన జూనియర్ బచ్చన్ తన కుటుంబం గురించి షాకింగ్ విషయాలు వెళ్లడించారు. తన కుటుంబం ఒకప్పుడు ఎదుర్కొన్న ఆర్థి్క సంక్షోభం గురించి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైయ్యారు.
అభిషేక్ బచ్చన్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం కోసం బోస్టన్ యూనివర్సిటీలో చేరిన సమయంలో తన తండ్రి అమితాబ్ బచ్చన్ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఓపక్క నిర్మాతగా కోట్ల రూపాయల నష్టపోయారని.. మరోపక్క హీరోగా సినిమా ఆఫర్లు లేక అల్లాడిపోయారని అన్నారు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ తనతో కలిసి పని చేసిన వాళ్ల దగ్గర అప్పు చేసేవారని తెలిపారు. బోస్టన్ యూనివర్సిటీలో ఉన్న తనను ఇంట్లో సమస్యలు కలవరపెట్టాయని గుర్తు చేసుకున్నారు. దాంతో యాక్టింగ్ కోర్స్ మధ్యలోనే వదిలేసి ఇంటికి వచ్చానని అన్నారు. అలాంటి క్లిష్ట సమయంలో ఒక కొడుకుగా ఇంట్లో వాళ్లకు దగ్గరగా ఉండి నైతిక స్థైర్యాన్ని అందించడం తన బాధ్యత అనిపిందని చెప్పారు.