వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సైలెంట్‌గా వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద సంచలనం సృష్టించింది. అంతేకాదు, ఈ సినిమా గురించి ఢిల్లీ రాజకీయాల్లోనూ గట్టి చర్చే జరిగింది. ఏకంగా ప్రధాన మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఏదైతేనేం సినిమా మాత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దీంతో భారీగానే కలెక్షన్లూ రాబట్టింది. అటు దర్శకుడికి మంచి పేరు, ఇటు నిర్మాతలకు అద్భుతమైన లాభాలూ వచ్చాయి.
‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ కేవలం హిందీలోనే విడుదలైన దేశవ్యాప్తంగా.. ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే తాజాగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలవటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిసినట్టు..? పవన్, అభిషేక్ కాంబోలో ఏదైనా సినిమా రాబోతోందా..? అనే చర్చ మొదలైంది.
అంతేకాదు, వీరి భేటీ అనంతరం అభిషేక్ ట్వీట్ చేయటంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ‘డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలవడం, ఆయనతో సుదీర్ఘమైన సంభాషణ జరపడం చాలా ఆనందంగా ఉంది. #PSPK’ అని అభిషేక్ ట్వీట్ చేశారు.
కాగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సూపర్ సక్సెస్ అయినందుకు అభిషేక్‌కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఈ సమావేశం సాధారణమైనదేనని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో వీరిద్దరి కాంబో సెట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.