పాకిస్థాన్ కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాక్ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 99 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులతో పాటు 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. విమానం కూలిన ఘటనలో అందరూ చనిపోయారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-8303 విమానం లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా కరాచీ సమీపంలో కూలిపోయింది.
ఎయిర్‌పోర్ట్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని మోడల్ కాలనీ సమీపంలో విమానం కుప్పకూలింది. 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో జనం పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పాక్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.