ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ఎబివిపి ఆంధ్ర విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసింది. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. ఆ వినతి పత్రంలో
ఏయూ హాస్పిటల్ తెరవాలని,ప్రతి డిపార్ట్మెంట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కోరారు.
Advertisements
అలాగే అమ్మాయిల మరుగుదొడ్ల కల్పన కై చర్యలు తీసుకోవాలని ఏయూ వసతిగృహాల్లో ఫ్యాన్స్, బల్బులు వేయాలని మరమ్మమత్తులు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని అమ్మాయిల వసతి గృహాల్లో న్యూస్ పేపర్ వేయించాలని తెలిపారు. ఈ సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని కోరారు.