ఇంటర్ ఫలితాల విషయంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏబీవీపీ గళమెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా డీఐఈవో కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించింది.
కరోనా కొనసాగుతున్న సమయంలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారని.. ఆ సమయంలో పాఠాలు సరిగ్గా చెప్పలేదన్నారు ఏబీవీపీ నాయకులు. దాదాపు 60 శాతం మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఫలితాల విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని.. ఇప్పటికైనా రీవాల్యుయేషన్ నిర్వహించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.