అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కాలేజ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ బ్లాక్ వద్ద కార్యకర్తలు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలో ఉన్నటువంటి సమస్యలపై వారి నిరసన తెలుపుతూ.. వెంటనే వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
లైబ్రరీలో ఔట్ డేటెడ్ బుక్స్ మార్చి.. ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా పుస్తకాలు సమకూర్చలన్నారు. అలాగే లాబ్ ఈక్విమెంట్స్ విద్యార్థులకు తగిన సంఖ్యలో కంప్యూటర్స్ సమకూర్చాలని కోరారు.
అదే విధంగా క్లాస్ రూమ్ లో విద్యార్థి సంఖ్యకు తగిన బెంచులు ఏర్పాటు చేయాలని, ఇంకా వివిధ సమస్యలు అన్నింటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రిన్సిపాల్ కి వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు శ్రావణ్, కార్యదర్శి హర్ష, టౌన్ సెక్రటరీ సురేష్, SFS కన్వీనర్ అజయ్, SFD కన్వీనర్ చంద్రకాంత్, జాయింట్ సెక్రెటరీలు విష్ణుకాంత్, పవన్, ధనరాజ్, మనోజ్, మహేష్ , వైస్ ప్రెసిడెంట్లు సాయినాథ్, ఇబ్రహీం, శివరాజ్, శివ ఇంచార్జిలు నవీన్, శివాజీ, విద్యార్థి శక్తి ఇంచార్జ్ నితిన్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఇందు, పూజిత, స్వాతి, వినయ్, రాజేశ్వరి, పెద్ద ఎత్తున విద్యార్థి కార్యకర్త మిత్రులు తదితరులు పాల్గొన్నారు.