ఇంట్లో ఏసీ పేలి తల్లీ, ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూరలో జరిగింది. డీటైల్స్ లోకి వెళ్తే.. రాయచూరలోని శక్తి నగర్ లో రంజిత, సిద్దలింగయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మృదుల(13), కారుణ్య (11) అనే పిల్లలు కూడా ఉన్నారు.
భర్త సిద్దలింగయ్య స్థానికంగా ఉండే థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి భర్త సిద్దలింగయ్య ఉద్యోగానికి వెళ్లడంతో.. భార్య, ఇద్దరు పిల్లలు ఏసీ ఆన్ చేసి నిద్రపోయారు.
అయితే అర్థరాత్రి ప్రమాదవ శాత్తు ఏసీకి కరెంట్ షాక్ తగిలి ఒక్కసారిగా పేలింది. మహిళ తేరుకుని బయటపడేలోపే ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటల ధాటికి తల్లీ, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వెంటనే స్పందించిన స్థానికులు మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆ మంటల్లో కాలిపోయిన తల్లిని ఇద్దరు పిల్లలను చూసి భర్త సిద్దలింగయ్య, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.