హైదరాబాద్: ఇఎస్ఐలో మందుల కొనుగోలు వ్యవహారాల్లో జరిగిన అవకతవకలపై సోదాలు చేస్తోన్న ఏసీబీ ఇప్పుడు అరెస్ట్‌ల పర్వాన్ని మొదలుపెట్టింది. కేసులో కీలక నిందితులుగా పేర్కొంటున్న ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరా, ఫార్మసిస్ట్ రాధిక, ఓమిని మెడి ఉద్యోగి నాగరాజు, ఓమిని మెడీ ఎండీ శ్రీహరితో పాటు హర్షవర్ధన్‌లను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే 23 చోట్లకు పైగా ఏసీబీ సోదాలు నిర్వహించగా, పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.