ఏసీబీ కన్నేసిందని తెలిసినా అవినీతి అధికారులకు మత్తు వదలడం లేదు. ఈమధ్య ఎక్కడో ఓచోట లంచం తీసుకుంటూ దొరికిపోతున్నారు. తాజాగా కూకట్ పల్లి జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న చాంద్ భాషా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మ్యుటేషన్ విషయంలో చాంద్ భాషాను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. అయితే పని జరగాలంటే రూ.8వేలు లంచం ఇవ్వాల్సిందేనని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ గీసి చాంద్ భాషాను పట్టుకున్నారు.
విచిత్రం ఏంటంటే ఇదే ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న షణ్ముగం కూడా లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించి రూ.2,500 లంచం డిమాండ్ చేశాడు షణ్ముగం.