మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి పీఏ సురేష్ రెడ్డిపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ టీమ్స్ ఏక కాలంలో దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.6 కోట్ల మేరకు ఆస్తులు గుర్తించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి చాలా కాలంగా దివాకర్ రెడ్డికి పీఏగా పనిచేస్తున్నారు. దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నాలేకపోయినా సురేష్ రెడ్డి అతని దగ్గరే పనిచేస్తున్నారు. సురేష్ రెడ్డి దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వలో ఈ దాడులు కొనసాగుతన్నాయి.