కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో నాగరాజు కేసు కీలక టర్న్ తీసుకుంది. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులను ఏసీబీ విచారించింది. నిందితులు ఇచ్చిన కస్టడి వాంగ్మూలం ప్రకారం… ఈ కేసులో ఓ కలెక్టర్ ప్రమేయం కూడా ఉన్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.
ఓ కలెక్టర్, కీసర ఆర్డీవో రవితో పాటు మరో ఎమ్మార్వో ఉన్నారని… హన్మకొండ కిరణ్ ప్రకాష్ ద్వారానే కీసర ఎమ్మార్వో, ఆర్డీవోల మధ్య వ్యవహరం నడించిందని ఏ3 నిందితుడు శ్రీనాథ్ ఏసీబీకి చెప్పారు. 614సర్వె నెంబర్ లోని 61ఎకరాల 20గుంటల భూమి విషయంలో అగ్రిమెంట్ కుదిరిందని, భూమి మ్యూటేషన్ చేయించే అంశం ఆర్డీవోకు తీసుకున్నారని ఒప్పుకున్నారు. ఆ కోటి పది లక్షల రూపాయలను వరంగల్ నుండి తీసుకొచ్చినట్లు అంగీకరించారు.
కలెక్టర్, ఆర్డీవో సూచనలతోనే తాను గెస్ట్ హౌజ్ కు వెళ్లానని ఏ1 నిందితుడు నాగరాజు ఏసీబీ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. శ్రీనాథ్ భూ వ్యవహరం ఏదీ తన పరిధిలో లేదని, తన తండ్రి డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేశాడని, తన ఉద్యోగమే తనకు వచ్చిందని ఏసీబీకి చెప్పాడు. గతంలో నాగరాజు అక్రమాస్తులు 10కోట్లని తేలగా… 55లక్షల బంగారం తాజాగా భయటపడింది. నాగరాజు అక్రమ సంపదనపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది.
అయితే ఎమ్మార్వో చెప్పిన కలెక్టర్ ఎవరు…? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.