మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఓ ల్యాండ్ డ్యాక్యుమెంట్స్ కు సంబంధించి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు అలీ. అయితే సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు.
పక్కా ప్లాన్ గీసి.. రైటర్ వాసు ద్వారా సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.