చిన్నపాటి నిర్లక్ష్యం తీరని శోకాన్ని మిగిల్చుతుంది. ఈమధ్య తెలంగాణలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. మద్యం మత్తులో ఒకరు.. అతివేగంతో ఇంకొకరు.. ర్యాష్ డ్రైవింగ్ తో మరికొరు.. ఇలా నిర్లక్ష్యంతో బాధిత కుటుంబాలను శోకసంద్రంలో ముంచేస్తున్నారు.
తాజాగా హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనాన్ని లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
మాందారిపేట దగ్గరలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. పత్తిపాక గ్రామానికి చెందిన కూలీలు.. మొగుళ్లపల్లి మండలం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా మిరప తోటలో పని కోసం వెళ్తున్నారు.
ఈ ప్రమాదంలో మో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.