హైదరాబాద్: అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌లో రెయిలింగ్ కూలి ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు కూకట్‌పల్లికి చెందిన మౌనిక(26)గా గుర్తించారు. నగరంలోని అమీర్‌పేట ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో సదరు మహిళ మెట్రో స్టేషన్ కింద నిల్చుంది. ఆ సమయంలో స్టేషన్ రెయిలింగ్ పెచ్చులు ఊడి ఆమె మీద పడ్డాయి. దీంతో తీవ్రంగా గాయపడిన మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.