ఓవైపు కడుపు కాలుతున్నా, బతుకు మీద భయంతో… నా సొంతూర్లో, నా మనుషుల మధ్య ఉంటానన్న బాధ వలస కూలీ జీవితాలనే లేకుండా చేస్తుంది. విమానాల్లో తీసుకొచ్చి, హోటల్ రూముల్లో ఉంచే ప్రభుత్వాలకు కాలి నడకన వలస బతుకు ప్రయాణ పోరాటం ప్రభుత్వాలకు కనపడటం లేదు.
ఖాలీ కడుపుతో కి.మీ నడవలేక చనిపోతున్నకార్మికులు కొందరైతే, ప్రయాణంలో జరుగుతున్న ప్రమాదాలతో మృత్యువాత పడుతున్న వారు మరికొందరు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. వాళ్లంతా బీహార్ లోని తమ సొంతూరుకు వెళ్లేందుకు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా వరుస ప్రమాదాలతో మరణించిన కూలీల సంఖ్య 70కి చేరింది.