టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సమయంలో ఒక్కసారిగాఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 4 కార్లతో పాటు ఇద్దరు రిపోర్టర్ల కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కార్లలో ప్రయాణిస్తున్న రిపోర్టర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఇవాళ కేటీఆర్ ఇలాక సిరిసిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. 20వ రోజు టీపీసీసీ పాదయాత్ర సిరిసిల్లా జిల్లాలో జరుగనుంది. ఇందులో భాగంగానే, ఇవాళ ఉదయం 8 గంటలకు శ్రీపాద 9 వ ప్యాకేజ్ సందర్శన ఉండే. ఉదయం 12.30 గంటలకు క్యాంపు వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘం,జఫర్ సంఘాలతో సమావేశం జరుగనుంది.