ప్రధాని మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ (narendramodi_in )హ్యాక్ అయ్యింది. కరోనా రిలీఫ్ ఫండ్ కోసం బిట్ కాయిన్ డొనేట్ చేయాలని హ్యాకర్ మోదీ అకౌంట్‌లో వరుసగా ట్వీట్లు చేశాడు. ఆ తర్వాత వాటిని తొలగించాడు. రాత్రి 3.15 సమయంలో అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కాగా మోదీ ట్విట్టర్ అకౌంట్ జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది.
మోదీ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించిన ట్విట్టర్ వెంటనే అప్రమత్తమైంది. వెంటనే ఆ అకౌంట్‌ను తమ అధీనంలోకి తీసుకొంది. మోదీ పర్సనల్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం వాస్తవమేనని.. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ తెలిపింది. ప్రధాని పర్సనల్ ట్విట్టర్ అకౌంట్‌ను ప్రస్తుతం 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
ఇటీవలే అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, అమెరికాలోని పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు కూడా ఇలానే హ్యాక్ అయ్యాయి.