హైకోర్టు లాయర్ల మర్డర్ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మంథని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ పేరు తెరపైకి రాగా… పోలీసులు తనను అరెస్ట్ చేసి, రహస్యంగా విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ విచారణలో మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ప్రొద్భలంతోనే ఈ హత్య చేసినట్లు కుంట శ్రీనివాస్ ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. శ్రీనివాస్ అసలు విషయం భయటపెట్టారని తెలియగానే… పుట్టా మధు ప్రభుత్వ పెద్దల శరణు కోరుతూ హైదరాబాద్ బయలుదేరినట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే, స్థానిక పోలీసుల ప్రమేయంపై కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో… కేసు నీరుగార్చే ప్రమాదం ఉందని, పారదర్శకంగా విచారణ జరిగేలా చూడాలని లాయర్ల జేఏసీ డిమాండ్ చేస్తోంది.