ప్రియాంకరెడ్డిని క్రూరంగా హత్య చేసిన నలుగురిని చంపేయండంటూ నిందితుల కన్నతల్లులు కూడా కోరుతున్నారు. నలుగురి తల్లులను తొలివెలుగు మాట్లాడించే ప్రయత్నం చేయగా….
చెన్నకేశవులు తల్లి:
నేను కూడా ఓ ఆడదాన్నే. నాకు ఆడపిల్లలున్నారు… నేను 9 నెలలు మోసి పెంచినట్లే, ప్రియాంక తల్లి కూడా మోసి పెంచింది. కన్న కడుపు ఎవరిదైనా ఒకటే… ఆ ఆడదాన్నిఅలా చంపిన నా కొడుకుడు కూడా అలా చావాల్సిందే అంటూ ఏడ్చేసింది.
నా కొడుకును కూడా ఊరితీయండి అంటూ కన్నీటితోనే కోరింది.
నవీన్ తల్లి:
నవీన్ నా కొడుకే… ఇలా చేశాడంటే నమ్మలేకుండా ఉన్నా. కానీ నా కొడుకు అయినా సరే శిక్ష పడాల్సిందే. నాకు ఆడపిల్లలు ఉన్నారు. నా బిడ్డను ఎవరైనా ఇలా చేస్తే ఎలా ఊరుకుంటాను అంటూ ఏడ్చేసింది.
పాషా తల్లి:
నా కొడుకు అలాంటి వాడు అంటే నమ్మలేను. ఏడు సంవత్సరాల నుండి లారీ నడుపుతున్నా… ఇలా ఎప్పుడు చేయలేదు. తప్పు చేస్తే మాత్రం నా కొడుకును ఉరి తీయండి. నడి రోడ్డు మీద ఉరితీయాల్సిందే… కానీ అలా చేశాడంటే నమ్మలేకుండా ఉన్నా అంటూ పాషా తల్లి విలపిస్తుంది.
అయితే… ఎ-1 నిందితుడిగా ఉన్న పాషానే దీని అంతటికి సూత్రధారి అని పోలీసులు కూడా ప్రకటించారు.
శివ తల్లి:
నా కొడుకు అందరిలోనూ చిన్నవాడు. నా కొడుకుతో మద్యం తాగించి తప్పు చేయించారు. వారికి పడే శిక్షలే మావాడికి ఉంటాయా అంటూ ప్రాదేయపడింది. కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని… శిక్షించండి అంటూ పేర్కొంది.