నిర్భయ నిందితులను ఉరితీసే అవకాశం తనకివ్వాలంటూ మహిళా షూటర్ వర్టికాసింగ్ రక్తాక్షరాలతో కేంద్రానికి లేఖ. తనకు అనుమతివ్వాలని అమిత్ షాను కోరారు. మన దేశంలో మహిళలను అపరకాళిగా భావిస్తారని, నిందితులను ఉరితీసే అవకాశం తనకిస్తే ఆ భావన మరింత బలపడుతుందని పేర్కొన్నారు
నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రెడి అవుతోందన్న వార్తలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిర్భయ నిందితుల క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కొట్టివేశారు. దాంతో వారు సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయగా మంగళవారం విచారణకు రాబోతుంది.
అయితే, నిందితులను ఉరి తీసేందుకు బుక్సార్ జైల్లో తలారి లేడని తెలుస్తోంది. దీంతో… ఉరితీసేందుకు దేశవ్యాప్తంగా పలువురు తలారీలు ముందుకు వస్తున్నారు.
మహిళను అపరకాళిగా పూజించే ఈ దేశంలో… నిర్భయ నిందితుల వంటి దుర్మార్గులను ఉరి తీసే అవకాశం మహిళగా తనకు ఇవ్వాలంటూ మహిళా షూటర్ వర్ణికాసింగ్ తన రక్తంతో కేంద్రానికి లేఖ రాశారు. నిర్భయ నిందితులను ఉరితీసే అవకాశం మహిళలకు కల్పిస్తే… అపరకాళి అనే భావన మరింత బలపడుతుందని, మహిళలకు ఎంతో దైర్యం చేకూర్చినట్లు అవుతుందని తన లేఖలో పేర్కొన్నారు. ఉరి తీసే అవకాశం తనకు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను లేఖలో కోరారు.