అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఐఏఎస్,ఐపీఎస్ ల సమావేశంలో అన్నా మీరే నన్ను ముందుకు నడిపించాలి అన్న జగన్ ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నారని ఆరోపించారు. వైకాపా రాక్షస సేన… వినలేని బూతులు,వేధింపులతో అధికారులపై విరుచుకుపడుతుంది.
మొన్న ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ,నేడు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ పై తప్పుడు పనులకు సహకరించడం లేదని మానసికంగా వేధిస్తున్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దొంగ పనులకు సహకరించమని బెదిరించి వారిని జైలు పాలు చేశారు. ఇప్పుడు మరోసారి తన స్వార్దానికి అధికారులను బలి ఇవ్వాలని చూస్తున్నారు జగన్ చుస్తున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.