ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి గారడీ మాటలతో పబ్బం గడుపుకునేలా వైకాపా 9నెలల పాలన సాగిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. బలహీనవర్గాలు ఎప్పుడూ టీడీపీ అండగా ఉంటుందనే అణిచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకుని ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. బలహీనవర్గాల నిధులు దారి మళ్లిస్తున్నారని ప్రశ్నించటమే విజయ్ కుమార్ చేసిన తప్పా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
పోస్టు పెట్టినందుకు ముఖానికి ముసుగువేసి తీవ్రవాదిలా చిత్రీకరిస్తారా అంటూ మండిపడ్డారు. అదే ప్రశ్న ఇప్పుడు మేము అడుగుతున్నాం.. ధైర్యం ఉంటే జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల నిధులు అమ్మఒడికి మళ్లించి బలహీన వర్గాల పొట్ట కొడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు మంచి చేయటానికి అధికారం ఇస్తే అది మాపై కక్షకట్టేందుకు వినియోగిస్తారా అంటూ ప్రశ్నించారు. మాపై కేసులు పెట్టడానికి ప్రజలు అధికారం ఇచ్చారా అని నిలదీశారు.
మరో వైపు మంత్రి బొత్స తానే లెక్కపెట్టినట్లు 2 వేల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. సత్తిబాబు గారూ మీకూ నాకూ ఇంగ్లీష్ రాదు….! సత్తిబాబు అంటే సత్యం చెప్పాలి…కానీ బొత్స ను మా ప్రాంతంలో అసత్య బాబు అంటారని యెద్దవా చేశారు.