అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
600 రోజులుగా అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. వారి పోరాటానికి ఎప్పుడూ టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రాష్ట్ర ప్రజల కలను జగన్ రెడ్డి చెల్లా చెదురు చేశారు. భవిష్యత్ ను అంధకారం చేస్తున్న జగన్ పై ప్రజలు తిరగబడాలి.
ఆనాడు అసెంబ్లీలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని జగన్ చెప్పారు. రాజధానికి కనీసం 30వేల ఎకరాలు తగ్గకుండా ఉండాలన్నారు. అలాంటిది.. గొప్ప విజన్ తో రూపొందించిన అమరావతిని ధ్వంసం చేయడానికి ఇప్పుడు మనసెలా ఒప్పింది.
చర్చి, మసీదు, గుళ్ల నుండి మట్టిని తెచ్చి అమరావతికి శంకుస్థాపన చేస్తే.. దాన్ని అవమానించేలా జగన్ వ్యవహారం ఉంది. రైతుల పోరాటానికి ప్రతిఫలం దక్కుతుంది. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయం.