చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా నిన్నటితో 10 రోజుల రన్ పూర్తి చేసుకుంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. నిన్న, మొన్న కూడా ఈ సినిమాకు వసూళ్లు పెద్దగా రాలేదు. ఈ సినిమా కంటే అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపించారు.
అలా తప్పనిసరి పరిస్థితుల మధ్య థియేటర్లలో కొనసాగుతన్న ఆచార్య సినిమాకు ఈ 10 రోజుల్లో 40 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంతో పాటు గుంటూరు, నెల్లూరు, వెస్ట్ గోదావరిలో ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. మిగతా ఏరియాల్లో యావరేజ్ గా నడుస్తున్నప్పటికీ, ఆ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ కష్టమని ట్రేడ్ ఆల్రెడీ తేల్చేసింది.
తాజా వసూళ్ల ప్రకారం చూసుకుంటే, ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 84 కోట్ల రూపాయలు కావాలి. అది ఎంతమాత్రం సాధ్యం కాదు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రన్ దాదాపు ముగిసింది. ఈ వారాంతం సర్కారువారి పాట సినిమా వస్తోంది. ఆ మూవీ రాకతో ఆచార్య రన్ ముగిసేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ 10 రోజుల్లో ఆచార్య సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 12.39 కోట్లు
సీడెడ్ – 6.18 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.85 కోట్లు
ఈస్ట్ – 3.24 కోట్లు
వెస్ట్ – 3.40 కోట్లు
గుంటూరు – 4.59 కోట్లు
కృష్ణా – 3.08 కోట్లు
నెల్లూరు – 2.94 కోట్లు