ఆచార్య సినిమాపై వచ్చిన నెగెటివ్ టాక్ ప్రభావం, వసూళ్లపై గట్టిగా పడింది. మొదటి రోజు మొదటి ఆటకే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను చూసేందుకు రెండో రోజు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. ఆ ప్రభావం ఎంతలా పడిందంటే, మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజుకు కలెక్షన్లు నాలుగు వంతులు పడిపోయాయి. ఇప్పుడు లెక్కల్లో చూద్దాం..
మొదటి రోజు ఆచార్య సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాకపోతే ఇందులో జీఎస్టీని కూడా కలిపి చెప్పారు. సో.. జీఎస్టీ మొత్తాలు కూడా తీసేసి చూస్తే.. ఫస్ట్ డే ఆచార్య సినిమాకు నికరంగా వచ్చిన షేర్ అటుఇటుగా 29 కోట్ల 50 లక్షల రూపాయలు.
ఇక రెండో రోజు విషయానికొస్తే.. హయ్యర్స్, జీఎస్టీలు మినహాయించగా.. ఆచార్య సినిమాకు వచ్చిన షేర్ కేవలం 5 కోట్ల 15 లక్షల రూపాయలు మాత్రమే. మొదటి రోజుకు, రెండో రోజుకు వసూళ్లలో వచ్చిన వ్యత్యాసాన్ని ఇప్పుడు ఈజీగా గుర్తించవచ్చు. అలా నెగెటివ్ టాక్, ఆచార్యను గట్టిగా దెబ్బకొట్టింది. విడుదలైన ఈ 2 రోజుల్లో ఆచార్య సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం -రూ. 10.10 కోట్లు
సీడెడ్ – రూ. 5.23 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.14 కోట్లు
ఈస్ట్ – రూ. 2.86 కోట్లు
వెస్ట్ – రూ. 3.18 కోట్లు
గుంటూరు – రూ. 4.26 కోట్లు
కృష్ణా – రూ. 2.33 కోట్లు
నెల్లూరు – రూ. 2.55 కోట్లు