చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. నిన్నట్నుంచి ఈ సినిమా ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. ట్రైలర్ రిలీజైంది. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే రిలీజ్ కు ఇది సరిపోతుందా? విడుదలకు ఇంకా 2 వారాల టైమ్ ఉంది. ఈలోగా ట్రైలర్ హంగామా తగ్గిపోతుంది కదా? దీనికి ఆచార్య యూనిట్ తిరుగులేని ప్లాన్ రెడీ చేసింది.
సినిమా విడుదలకు సరిగ్గా 3 రోజుల ముందు ఆచార్య సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. అంతేకాదు, ఆ ట్రైలర్ కూడా సిద్ధంగా ఉంది. ముందుగానే ఇలా ఫిక్స్ అయ్యారు మేకర్స్. ప్లాన్ లో భాగంగానే ముందుగా యాక్షన్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ట్రయిలర్ లో చిరు-చరణ్ యాక్షన్ పార్ట్ ఎక్కువగా కనిపించింది. నిజానికి ఇది కొరటాల శివ మార్క్ కూడా కాదు.
అయితే అసలైన ఎమోషన్స్ అన్నీ మరో ట్రైలర్ కోసం దాచిపెట్టారు. విడుదలకు 3 రోజుల ముందు ఆచార్య నుంచి ఎమోషనల్ ట్రైలర్ రాబోతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కుదిరితే అదే రోజు ఆచార్య సినిమా నుంచి సెకెండ్ ట్రైలర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉంది.
Advertisements
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 తర్వాత భారీ అంచనాలతో వస్తోంది ఆచార్య మూవీ. ఈ సినిమా కోసం ఇప్పటికే అగ్రిమెంట్లు అన్నీ పూర్తిచేశారు. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది. మరో విశేషం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ టైపులో ఆచార్య కోసం కుదిరితే వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారట.