ఆచార్య సినిమాకు మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ కొంతమంది పనిగట్టుకొని ఇలా చిరంజీవి సినిమాపై బురదజల్లుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అది నిజమేమో అని చాలా మంది అనుకున్నారు కూడా. కానీ ఆచార్య సినిమాపై ఎలాంటి అసత్య ప్రచారం జరగలేదు. చిరంజీవి-చరణ్ హీరోలుగా నటించిన ఆ సినిమా నిజంగానే ఫ్లాప్ అయింది. వీకెండ్ లెక్కలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 29 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ (జీఎస్టీ మినహాయించి) రాబట్టిన ఆచార్య సినిమా, రెండో రోజుకు పూర్తిగా చతికిలపడింది. కనీసం మూడో వంతు వసూళ్లు కూడా రాలేదు. శనివారం ఈ సినిమాకు కేవలం 5 కోట్ల 15 లక్షల రూపాయలు రాగా.. ఆదివారం ఆ మొత్తం మరింత పడిపోయింది. జస్ట్ 4 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.
ఓ పెద్ద హీరో సినిమాకు తొలి వీకెండ్ లోనే ఇంత డ్రాప్ ఉండడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. ఫ్లాప్ అయిన రాధేశ్యామ్ సినిమాకు కూడా మొదటి 3 రోజులు మంచి వసూళ్లు వచ్చాయి. ఆచార్యకు మాత్రం ప్రేక్షకులు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లను కూడా రద్దు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 11.56 కోట్లు
సీడెడ్ – రూ. 5.87 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.68 కోట్లు
ఈస్ట్ – రూ. 3.18 కోట్లు
వెస్ట్ – రూ. 3.27 కోట్లు
గుంటూరు – రూ. 4.52 కోట్లు
కృష్ణా – రూ. 2.84 కోట్లు
నెల్లూరు – రూ. 2.80 కోట్లు