డిజాస్టర్ టాక్ తో మొన్నటివరకు థియేటర్లలో నడిచిన ఆచార్య సినిమా, తన రన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కొన్ని థియేటర్లలో ఈ సినిమా నడుస్తున్నప్పటికీ, అది అగ్రిమెంట్ ప్రకారం జరుగుతున్న ఫార్మాలిటీ తప్ప, కలెక్షన్లకు పెద్దగా యాడ్ అయ్యేదేం ఉండదు.
వరల్డ్ వైడ్ ఈ సినిమాకు కేవలం 76 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. షేర్ లో చూసుకుంటే ఇది 50 కోట్ల రూపాయల లోపే ఉంటుంది. ఆచార్య సినిమాను ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల రూపాయలకు అమ్మారు. కానీ ఫైనల్ రన్ లో ఈ సినిమాకు కేవలం 50 కోట్ల లోపే వసూళ్లు వచ్చాయి. దీంతో బయ్యర్లకు అటుఇటుగా 84 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది.
టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన ఫైనల్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 38 కోట్లు
సీడెడ్ – రూ. 18.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 13 కోట్లు
ఈస్ట్ – రూ. 9.50 కోట్లు
వెస్ట్ – రూ. 7.20 కోట్లు
గుంటూరు – రూ. 9 కోట్లు
నెల్లూరు – రూ. 4.30 కోట్లు
కృష్ణా – రూ. 8 కోట్లు