రామ్ చరణ్, చిరంజీవి హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. ఈ మూవీ ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. టాక్ కు తగ్గట్టే బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది. సినిమాకు నష్టాలు మొదలైన వెంటనే దర్శకుడు కొరటాల శివ, హీరో రామ్ చరణ్ రంగంలోకి దిగారు. డిస్ట్రిబ్యూటర్లు అందరితో మాట్లాడారు. కొంతమేర నష్టాన్ని భరిస్తామని హామీ ఇచ్చారు.
అయితే.. అలా హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆచార్య సెటిల్ మెంట్స్ జరగలేదు. హీరోలు చరణ్, చిరు తమ రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయ్యర్లకు పేమెంట్లు అందలేదు. అసలేంటి కథ.. ఏం జరుగుతోంది?
ఈ మొత్తం వ్యవహారానికి అమెజాన్ సంస్థ కారణంగా మారింది. ఆచార్య సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుంది అమెజాన్ సంస్థ. సినిమా ఫ్లాప్ అవ్వడంతో యూనిట్ తో మరోసారి సంప్రదింపులు జరిపింది. అగ్రిమెంట్ డేట్ కంటే ముందుగానే స్ట్రీమింగ్ కు అనుమతిస్తే, ఎక్కువ మొత్తం ఇస్తామని ఊరించింది. డీల్ సెట్ అయింది. అనుకున్న తేదీ కంటే ముందుగానే ఆచార్య అమెజాన్ లోకి వచ్చేసింది.
Advertisements
ఇక్కడి వరకు అంతా ఓకే కానీ అమెజాన్ నుంచి నిర్మాతకు ఇంకా డబ్బులు రాలేదు. ఆ డబ్బు వస్తే కానీ బయ్యర్లకు సెటిల్ చేయలేనని చేతులెత్తేశారు నిర్మాత నిరంజన్ రెడ్డి. అలా ఆచార్య పేమెంట్స్ ఆగాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ నెలాఖరుకు ఆచార్య సెటిల్ మెంట్స్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది.