మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ పాత్ర నిడివి కూడా 30 నిమిషాలకు పైగానే ఉంటుందని కొరటాల శివ ఓ ఇంటర్వ్యూ చెప్పకనే చెప్పాడు.
అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్, టీజర్ లు అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచాయి. ఇదిలా ఉండగా మెగా అభిమానులు ఓ విషయంలో ఇప్పుడు భయపడుతున్నారు.
ALSO READ:సైడ్ క్యారెక్టర్స్ నుంచి హీరోలుగా మారిన మన హీరోస్
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న రిలీజ్ అయింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా కు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది. ఆ తర్వాత నిన్నకాక మొన్న పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మరో చిత్రం బీస్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పూజా హెగ్డే కావడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పూజా విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆచార్య లో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. మరి ఆచార్య రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
ALSO READ:టాలీవుడ్ కోల్పోయిన 10బెస్ట్ కమెడియన్స్ ! వీరి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనా ?