కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా నాజర్, అజయ్, సోనుసూద్ కీలక పాత్రలలో నటించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించారు.
ఎన్టీఆర్ కట్టించిన థియేటర్లు ఎందుకు మూతపడ్డాయో తెలుసా ?
అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో తక్కువ టైంలోనే ఓటిటి లోకి కూడా వచ్చింది. ఒక్క థియేటర్లోనే కాదు ఓటిటి కూడా ఈ సినిమా ఫెయిల్ అయింది. మెగాస్టార్ కెరీర్ ఒక పెద్ద ప్లాప్ చిత్రంగా ఇది నిలిచింది. పది కాదు,ఇరవై కాదు ఏకంగా 84 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
ఆర్ఆర్ఆర్ లో Jr. ఎన్టీఆర్ పట్టుకున్న జెండా చరిత్ర తెలుసా?
ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి తో కలిసి కొన్ని సీన్లలో పాద ఘట్టం కు చెందిన ఘట్టమ్మ గా ఓ అమ్మాయి నటించింది. కాగా ఆ అమ్మాయి గురించి చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా లో ఆరా తీస్తున్నారు. అయితే ఆమె పేరు ఎంఎల్ శృతి. ఆమె ఒక సింగర్. నందమూరి బాలకృష్ణ చేసిన అఖండ సినిమాలో అడిగా అడిగా అనే సాంగ్ ఈమెనే పాడింది. నటుడు జయంత్ ను వివాహం కూడా చేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
అయితే ఈ సినిమాలో చిరంజీవి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఇంస్టాగ్రామ్ లో శృతి పోస్ట్ పెట్టింది. చిరంజీవి తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని అలాంటిది ఆయన పక్కన నటించే ఛాన్స్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. షూటింగ్ సమయంలో గ్యాప్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడడం ఇంకా ఆనందంగా అనిపించేదని తెలిపింది. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకు ధన్యవాదాలు అంటూ పేర్కొంది శృతి.