మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి టాకీపార్ట్ మొత్తం పూర్తయింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదట. మే లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.
Advertisements
ఆ తర్వాత ఫస్ట్ సింగిల్…. ఫస్ట్ లుక్ ఇలా చిన్నచిన్న అప్డేట్స్ ను ఇచ్చారు మేకర్స్. కానీ అవిఏవి కూడా అనుకున్న స్థాయిలో ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేదు. ఇక రిలీజ్ విషయంలో కూడా సరైన క్లారిటీ లేకపోవడంతో సినిమా పై ఆసక్తి ఫాన్స్ లో తగ్గుతున్నట్లు సమాచారం. మరి ఇప్పుడైనా ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ను లేదా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తారో లేదో చూడాలి.