కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 4న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
అయితే ఇప్పుడు మరో సరికొత్త డేట్ అనౌన్స్ చేశారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్న రోజే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మేరకు టీం అధికారికంగా ప్రకటించింది. మరి చూడాలి ఈ రెండింటిలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో.