మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మరో వైపు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించారు.
ఇక కథ విషయానికొస్తే ధర్మస్థలి లో అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు విలన్ సోనూసూద్. సోనూసూద్ బసవ పాత్రలో నటించాడు. అక్కడ ఉన్న ప్రజలు సోనూసూద్ బారిన పడి ఇబ్బందులు పడుతుంటారు. వారి కష్టాలను తీర్చడానికి ఆచార్య ధర్మస్థలి కి వస్తాడు. అసలు ధర్మస్థలి కి ఆచార్యకు ఉన్న సంబంధం ఏంటి… ధర్మస్థలి లో నీలాంబరి పాత్రలో నటిస్తున్న పూజా హెగ్డే ఎవరి కోసం ఎదురు చూస్తుంది… పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధ ఏమైపోయాడు… అసలు సిద్ధ ఎవరు? ఆచార్య కి సిద్ద కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా కథ.
ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటన అలాగే రామ్ చరణ్ నటన అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చిరు, చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అలాగే ఆ ఇద్దరి పాత్రల మధ్య జర్నీ వీటన్నింటిని కూడా కొరటాల శివ చాలా బాగా చూపించాడు. మరో వైపు చరణ్ సరసన నటించిన పూజ హెగ్డే నటన కూడా చాలా బాగుంది. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. నాజర్, అజయ్, తనికెళ్ల భరణి వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్, చిరంజీవి,చరణ్ నక్సలైట్లు గా కనిపించే సీన్స్, క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా ఉంటుంది.
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే… ఫస్టాఫ్ సెకండాఫ్ రెండూ కూడా రొటీన్ సీన్స్ తో నడుస్తాయి. అలాగే కథ కూడా సాగదీసినట్లు అనిపిస్తుంది. తరువాత ఏం జరగబోతుంది అనేది ప్రతి ప్రేక్షకుడికి కూడా అర్థమైపోతుంది. మేకింగ్ స్టైల్స్ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ కి తప్ప సినీ అభిమానులకు ఆచార్య అంతగా కనెక్ట్ అవ్వదు. అలాగే మణిశర్మ సంగీతం కూడా.. ఒకటి రెండూ సాంగ్స్ మినహా మిగతా సాంగ్స్ లో, అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో తన మార్క్ కనిపించదు.
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయిందనే చెప్పాలి. దానికి ప్రధాన కారణం కథ లో కంటెంట్ మిస్ అవ్వటమే అని కూడా చెప్పుకోవచ్చు.