ఆచార్య ప్రమోషన్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రయిలర్ రిలీజైంది. రేపు ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇదే ఊపులో 23వ తేదీన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా పెట్టుకున్నారు. ఈ ఫంక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడా పుకార్లకు చెక్ పడింది. ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు సీఎం రావడం లేదు.
నిజానికి ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను విజయవాడలో ప్లాన్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి వస్తున్నారనే ప్రచారం జరిగింది. అందులో కొంత నిజం కూడా ఉంది. సీఎం కోసం చిరంజీవి ట్రై చేసిన మాట వాస్తవం. జగన్-చిరు ఈమధ్య బాగా క్లోజ్ అయిన సంగతి తెలిసింద్. ఆ చనువుతో ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు జగన్ వస్తారని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేదికను మార్చారు. 23నే ఫంక్షన్ జరుగుతుంది. కానీ అది బెజవాడలో కాదు, దాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఈ ఒక్క మార్పుతో ఇన్నాళ్లూ వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ అంటూ జరిగిన ప్రచారానికి చెక్ పడింది. మరో ముఖ్యమైన అతిథి కోసం చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
తెలంగాణ నుంచి పొలిటికల్ గా చూసుకుంటే, ఇలాంటి ఫంక్షన్లకు మంత్రి కేటీఆర్ తరచుగా హాజరవుతుంటారు. మరి ఆచార్యకు కూడా ఆయనే వస్తారా లేక రాజకీయాలకు దూరంగా మరో సినీ ప్రముఖుడితో ఫంక్షన్ కానిస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. పవన్ కల్యాణ్ మాత్రం ఈ వేదికకు వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది.